బిగ్‌బాస్ షో చూపిస్తూ క్లిష్టమైన సర్జీరీని కూల్‌గా చేసిన వైద్యులు..
Send us your feedback to audioarticles@vaarta.com
అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు బిగ్‌బాస్ షో, అవతార్ మూవీ చూపిస్తూ కూల్‌గా కానిచ్చేశారు. అది ఆషామాషీ శస్త్ర చికిత్స అయితే ఇంతగా చెప్పుకోవాల్సిన పని లేదు. మెదడుకు నిర్వహించే శస్త్రచికిత్స. ఆపరేషన్ సమయంలో రోగిని మెలకువగా ఉంచి.. బిగ్‌బాస్ షోని చూపిస్తూ విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను గుంటూరు వైద్యులు శేషాద్రి శేఖర్, భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, త్రినాథ్‌లు మీడియాకు వివరించారు.
పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరప్రసాద్(33)కు బ్రెయిన్ ట్యూమర్‌గా వైద్యులు గుర్తించారు. దీంతో 2016లోనే ఆపరేషన్ చేసి కణతిని తొలగించారు. కాగా.. గత కొన్ని నెలలుగా వరప్రసాద్‌కు ఫిట్స్ వస్తున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెడదులో తిరిగి కణితి పెరిగినట్టు గుర్తించారు. దీంతో ఓ అరుదైన శస్త్ర చికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 10న త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని నావిగేషన్ సాయంతో కణతి ఎక్కడుందో అక్కడ మాత్రమే తెరిచి దానిని తొలగించారు.
కాగా.. రోగిని స్పృహలో ఉంచి మాత్రమే ఈ శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. కీలకమైన ప్రాంతంలో ఈ శస్త్ర చికిత్సను నిర్వహిస్తున్నందున రోగిని మాట్లాడిస్తూ అతని మెదడులో సంభవిస్తున్న పరిణామాలను పరిశీలిస్తూ ఈ శస్త్ర చికిత్సను నిర్వహించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ సమయంలోనే రోగికి బిగ్‌బాస్‌తో పాటు అవతార్ సినిమాలను చూపిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూల్‌గా శస్త్ర చికిత్సను నిర్వహించారు. బీమా పైనే ఈ సర్జరీని చేయడంతో దీనికోసం ఖర్చు కూడా ఏమీ కాలేదు. కాగా.. వరప్రసాద్ పూర్తిగా కోలుకోవడంతో అతడిని వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments