ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాలని సోనియాకు వైద్యుల సూచన..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయటికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్యులు సూచించినట్లు సమాచారం. ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోగ్య పరమైన సమస్యలున్న వారికి ఈ కాలుష్యం మరింత సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ కాలుష్యం కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి ఢిల్లీని వదిలి బయటకు వెళ్లాలని వైద్యులు సలహా ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సోనియా గాంధీ గత కొంత కాలంగా ఛాతికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె జూలై 30న ఆమె గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె పెద్దగా కోలుకున్నదేమీ లేదు. దీంతో ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటూ వస్తున్నారు. ఢిల్లీలోని కాలుష్యం కారణంగా ఉబ్బసం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సోనియాకు సూచించారు.
ఢిల్లీలోనే ఇంకా ఉంటే సోనియాకు ఛాతి నొప్పి కూడా తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని, అందుకే వేరే ఏదైనా సురక్షితమైన ప్రాంతానికి షిఫ్ట్ కావాలని ఆమెకు వైద్యులు సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సూచనలతో సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియాతో పాటు ఆమెకు సహాయంగా ఉండేందుకు రాహుల్ లేదా ప్రియాంక కూడా వెళ్లనున్నట్లు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout