జూన్ 2న వస్తొన్న 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి'

  • IndiaGlitz, [Monday,May 28 2018]

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం 'ఒరు ముగ తిరై'. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి' పేరుతో డి.వెంకటేష్ విడుద‌ల చేస్తున్నారు. సినిమా జూన్ 2న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా.

నిర్మాత డి.వెంక‌టేష్ మాట్లాడుతూ. సోష‌ల్‌మీడియా ఆధారంగా వాట్స్ అప్‌, ఫేస్‌బుక్ ఐడిల్స్‌ని వేరే ఫొటోలు పెట్టి చాటింగ్‌లు చేసి చీట్ చెయ్య‌డం వంటివి మ‌నం ఎక్కువ‌గా చూస్తున్నాం. దీన్ని ఆధారంగా తీసుకుని క‌థ న‌డుస్తుంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రం.

ఈ చిత్రం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. చిత్రం మొత్తం ప్ర‌స్తుతం ట్రెండ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. టెక్నికల్ కారణాల వల్ల‌ ఒకరోజు లేటుగా జూన్ 2 న చిత్రాన్ని విడుదల చెస్తున్నామన్నారు

సాంకేతిక నిపుణులుః కెమెరామెన్: శ‌ర‌వ‌ణ పాండియ‌న్‌, మ్యూజిక్‌: ప‌్రేమ్ కుమార్‌, ఎడిటింగ్‌: ఎస్‌.పి.అహ్మ‌ద్‌, ఆర్ట్‌: వినోద్ ర‌వీంద్ర‌న్‌, స్టంట్స్‌: బిల్లా, జ‌గ‌న్‌, పాట‌లు: డాక్ట‌ర్ చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి.