సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారు.. ఆధారాలతో వెల్లడించిన డాక్టర్ మీనాక్షి
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు సుశాంత్‌ది ఆత్మహత్య అని తేల్చింది. అయితే అది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యేనంటూ ఇటీవల మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామితో పలువురు సెలబ్రిటీలు సైతం ఆరోపించారు. తాజాగా వీరి వాదనను సమర్థిస్తూ మీనాక్షి మిశ్రా అనే ప్రముఖ డెర్మిటాలజీ డాక్టర్ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో సుశాంత్‌ను దారుణంగా కొట్టి చంపేశాంటూ షాకింగ్ విషయాలను డాక్టర్ మిశ్రా వెల్లడించారు.
సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. ఆయన ముఖంతో పాటు ఇతర ప్రదేశాల్లో గాయాలను ఆమె వీడియోలో వివరించారు. ఉరి వేసుకుని మనిషి ఆత్మహత్య చేసుకుంటే నాలుకతోపాటు కనుగుడ్లు సైతం బయటకు వస్తాయని కానీ సుశాంత్ విషయంలో అవేమీ జరగలేదన్నారు. ఒక కన్ను మూసుకుపోయి ఉండగా.. మరో కన్ను తెరిచి ఉండటం.. ఆ కంటిపై ఉన్న గాయం చేతితో బలంగా కొడితేనే అవుతుందని వెల్లడించారు. సుశాంత్‌ని దారుణంగా కొట్టి చంపారన్నారు. సుశాంత్‌ని హింసించడానికి ముందు అతనికి మత్తు ఇచ్చి ఉండొచ్చని ఆమె భావిస్తున్నారు. మనల్ని పిచ్చోళ్లను చేస్తున్నారని.. కళ్లు మూసుకుని సుశాంత్‌ది మర్డర్ అని చెప్పగలనని మిశ్రా తెలిపారు.
Shocking relevations made on Sushant’s case!
— Dr.Minakshi Mishra (@savethesaviours) August 2, 2020
PS: Sensitive Content. pic.twitter.com/r0orseM72b
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com