తలనొప్పితో వచ్చిన మహిళను డాక్టర్ ఏం చేశాడో చూడండి!!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ బస్తీ దవాఖానాలో వైద్యుడి నిర్వాకంతో వార్తల్లో నిలిచాడు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో డాక్టర్ ఆసుపత్రికి వచ్చే మహిళా రోగులను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ మహిళ తలనొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా.. ఆమెకు మసాజ్ చేస్తూ జుట్టు కత్తిరించాడు.
అంతేకాదు ఆమెతో అసభ్యంగా మాట్లాడి మరోసారి ఆస్పత్రికి రావాలని వేధించసాగాడు. ఆస్పత్రికి వచ్చే ముందు స్నానం చేసి రావాలని.. ఇక్కడికి వచ్చినట్లు భర్తకు విషయం తెలియనివ్వొద్దని డాక్టర్ మహిలకు చెప్పాడు. డాక్టర్ మాటలకు ఇబ్బందిపడ్డ మహిళ తోటి మహిళలతో కలిసి ఆ వైద్యుడ్ని చితకబాదింది. అనంతరం ఆ కామాంధ వైద్యుడ్ని పోలీసులకు అప్పగించారు. అయితే ప్రభుత్వం నుంచి డాక్టర్ గుర్తింపు కార్డు లేకుండానే 3 నెలల క్రితం డాక్టర్ ఆస్పత్రి మొదలుపెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే రష్యాలో తాను ఎంబీబీఎస్ చేసినట్లు వైద్యుడు చెప్పుకుంటున్నాడు.
అసలేం జరిగింది..!?
ఈ సందర్భంగా బాధితురాలు పుష్ప మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రోజున తల నొప్పిగా ఉందని డాక్టర్ బాలరాజు దగ్గరికి వెళ్లానని.. తలకు మాసాజ్ చేసిన డాక్టర్ తనకు తెలియకుండా తల వెంట్రుకలు కత్తిరించాడని కంటతడిపెట్టారు. తనను దగ్గరికి తీసుకొని మాటలతో చెప్పుకోలేనంతగా విధంగా మాట్లాడి అసభ్యకరంగా ప్రవర్తిoచాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తల నొప్పికి తగ్గకపోగా మరింత ఎక్కువవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చూపిచుకున్నట్లు చెబుతున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనతో విసిగిపోయిన ఆ మహిళ పలువురు మహిళలతో ఆస్పత్రికి వచ్చి డాక్టర్ను చితకబాదారు. ప్రస్తుతం ఆ వైద్యుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments