నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య
Send us your feedback to audioarticles@vaarta.com
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుని అడ్డగించి డాక్టర్ దంపతులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పూర్‌కు చెందిన డాక్టర్ సందీప్ గుప్తా.. ఆయన భార్య డాక్టర్ సీమా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం తమ కారులో వెళుతుండగా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వారి కారును అడ్డుకున్నారు. అనంతరం బైక్‌పై వెనుక కూర్చొన్న వ్యక్తి నేరుగా కారు దగ్గరకు వెళ్లాడు.
ఇదీ చదవండి: విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు
విషయం ఏంటో తెలుసుకుందామని కారు అద్దాన్ని సందీప్ కిందకు దించారు. అంతే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల దేహాల్లోకి దిగిపోయాయి. కాల్పుల శబ్ధంతో అటుగా వెళుతున్న వారంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక నివ్వెరబోయారు. డాక్టర్ దంపతులు చనిపోయారని నిర్ధారించుకోగానే.. దుండగులు బైక్‌పై పారిపోయారు. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే డాక్టర్ దంపతుల హత్య ప్రతీకారంతోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 2019లో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళతో సందీప్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు అప్పుడు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ హత్య కేసులో సందీప్ దంపతులిద్దరూ అరెస్టై ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆ చనిపోయిన మహిళ సోదరుడే ఇప్పుడు సందీప్ దంపతులను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout