నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుని అడ్డగించి డాక్టర్ దంపతులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పూర్‌కు చెందిన డాక్టర్ సందీప్ గుప్తా.. ఆయన భార్య డాక్టర్ సీమా గుప్తా శుక్రవారం మధ్యాహ్నం తమ కారులో వెళుతుండగా.. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వారి కారును అడ్డుకున్నారు. అనంతరం బైక్‌పై వెనుక కూర్చొన్న వ్యక్తి నేరుగా కారు దగ్గరకు వెళ్లాడు.

ఇదీ చదవండి: విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విషయం ఏంటో తెలుసుకుందామని కారు అద్దాన్ని సందీప్ కిందకు దించారు. అంతే క్షణాల్లో తుపాకీ గుళ్లు ఆ దంపతుల దేహాల్లోకి దిగిపోయాయి. కాల్పుల శబ్ధంతో అటుగా వెళుతున్న వారంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక నివ్వెరబోయారు. డాక్టర్ దంపతులు చనిపోయారని నిర్ధారించుకోగానే.. దుండగులు బైక్‌పై పారిపోయారు. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే డాక్టర్ దంపతుల హత్య ప్రతీకారంతోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 2019లో ఓ మహిళ హత్యకు గురైంది. ఆ మహిళతో సందీప్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు అప్పుడు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ హత్య కేసులో సందీప్ దంపతులిద్దరూ అరెస్టై ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆ చనిపోయిన మహిళ సోదరుడే ఇప్పుడు సందీప్ దంపతులను హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

More News

పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో, హీరోయిన్.. ఎంట్రీ ఎప్పుడంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విరించి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లక్షల్లో ఫీజు వేయడంతో అంత ఫీజు ఎలా అయ్యింది?

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి..

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్.

ఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం

ఏపీలో కరోనాకు తొలిసారిగా మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేశారు. విజయవాడ ఆయుష్ హాస్పటల్‌లో కరోనా చికిత్సలో భాగంగా తొలిసారిగా ఈ ప్రయోగం నిర్వహించారు.