సమంత కేసు.. థంబ్నైల్స్, హెడ్డింగ్స్ మాకు కనీసం చూపించరు: సీఎల్ వెంకట్రావు
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు మూడు నెలల నుంచి సాగుతున్న డ్రామాకు తెరదించుతూ సమంత- నాగచైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తెలుగువారికి ముఖ్యంగా అక్కినేని అభిమానులను గట్టి షాక్కు గురిచేసింది. ఎంతో అన్యోన్యంగా వుండే వీరు డైవోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి..? అంటూ రకరకాలుగా కథనాలు వినిపించాయి. ఇక కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఈ విషయంలో కాస్త ఓవరాక్షన్ చేశాయి. ప్రతిరోజూ సమంత వ్యక్తిగత జీవితంపై రకరకాల వీడియోలు, అభ్యంతరమైన థంబ్నైల్స్ పెట్టాయి. తొలుత దీనిని సమంత పట్టించుకోలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది.
అయినప్పటికీ కొన్ని వెబ్సైట్స్, యూట్యూబర్లు శృతిమించడంతో సమంత యాక్షన్లోకి దిగారు. తన వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారనీ.. దీని వల్ల తన పరువుకు భంగం కలుగుతుందంటూ ఆమె కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలా సమంత ఆగ్రహానికి గురైన వారిలో డాక్టర్ సీఎల్ వెంకట్రావు కూడా ఒకరు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సీఎల్ వెంకట్రావు స్పందించారు. ఓ ప్రముఖ తెలుగు వార్తా సంస్థ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కంటెంట్ ఇచ్చేది తామే అయినా ఈ థంబ్నైల్స్ ఇచ్చేవాళ్లు వేరే ఉంటారని పేర్కొన్నారు. హెడ్డింగ్స్ విషయంలో కంటెంట్ ప్రొవైడర్స్ అయిన తమకు ఎటువంటి బాధ్యత ఉండదని వెంకట్ రావు స్పష్టం చేశారు. ఈ హెడ్డింగ్స్ ఇచ్చేందుకు ఎస్ఈవో అనే టీమ్ ప్రత్యేకంగా పని చేస్తుందని, వారు థంబ్నైల్స్కు ఏ హెడ్డింగ్ ఇస్తున్నారో, ఎలాంటి ఫొటోలు వాడుతున్నారో కూడా తమకు చెప్పరని ఆయన పేర్కొన్నారు. కాగా సీఎల్ వెంకట్రావు 'అబార్షన్, వ్యామోహమే విడాకులకు దారి తీసింది' అన్న థంబ్నైల్తో సమంత విడాకుల గురించి యూట్యూబ్లో వీడియో చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments