ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కొవిడ్ వైరస్‌ను చూడాలనుకుంటున్నారా?

  • IndiaGlitz, [Sunday,May 30 2021]

గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్ అనేది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా బుల్లెట్‌నే చూపిస్తామంటున్నారు కొందరు నిపుణులు. దీనిని ఓ మ్యూజియంలో.. వైరస్‌ను ముఖాముఖి చూపిస్తున్నారు. అమ్మో కరోనా వైరస్‌ను ముఖాముఖి చూడటమా? అనుకుంటున్నారా? ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగా కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒక వైరస్‌ను చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు.. మన కళ్లెదుట ఒక అందమైన దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది.

ఆక్స్‌ఫర్డ్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోవిడ్ 19 వైరస్‌ను ముఖాముఖిగా చూడొచ్చు. వైరస్ ఉందంటేనే ఆ ఏరియాకే వెళ్లడానికి సంకోచిస్తాం కదా.. ఈ మ్యూజియంలో మాత్రం ఫేస్ టు ఫేస్ చూసేయవచ్చు. అసలైన వైరస్ పరిమాణం కంటే ఇది 80,00,000 రెట్లు పెద్దది. ఎంతో భయం గొలిపే వైరస్‌ను ఇక్కడ దగ్గరి నుంచి చూడొచ్చు. ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగాను కనిపిస్తుంది. కొన్ని లక్షల సైంటిఫిక్ డేటాతో వైరస్ కళాకృతిని రూపొందించారు.

ఈ కళాకృతిని రూపొందించిన నిపుణుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత చూసి ఎంతో ఆశ్చర్యపోయామన్నారు. కొవిడ్ 19 వైరస్ ఎంతో భయంకరమైనదని.. అది ప్రపంచాన్ని గడగడలాడిస్తోందనే వార్తలను వింటూనే ఈ కళాకృతిని రూపొందించామని తెలిపారు. ఆశ్చర్యంగా అది చాలా అందంగా రూపుదద్దుకుందని వెల్లడించారు. ఒక గాజు బాక్సులో బంధీగా ఉన్న ఈ కొవిడ్ వైరస్.. మనలోని భయాందోళనను దూరం చేసి.. దాని సౌందర్యంపైనే దృష్టి సారించేలా చేస్తోంది.

More News

తానా ఎన్నికల్లో నిరంజన్‌ ప్యానెల్ ఘ‌న విజ‌యం

ఈసారి జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించాయి. ప్రతిష్మాత్మక ‘తానా’ సంస్థలో పలు కీలకమైన పదవుల కోసం జరగనున్న

మరో కొత్త ఫంగస్.. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి

కరోనా ఫస్ట్ వేవ్‌ సమయంలో తొలుత ట్రీట్‌మెంట్ విషయంలోనే కాస్త ఆందోళన చెందాం. ఆ తరువాత కరోనా ఒక్కటి అదుపులోకి వస్తే చాలని భావించాం. అనుకున్నట్టుగానే

యువ హీరోతో యువీ క్రియేషన్స్ డీల్.. తెరవెనుక ప్రభాస్ ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ యువ హీరో పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతడే సంతోష్ శోభన్. ఇటీవల ఓటిటీలో విడుదలైన ఏక్ మినీ కథ చిత్రంలో సంతోష్ హీరోగా నటించాడు.

ఎల్లో ఏంజిల్.. ఇషా రెబ్బ లేటెస్ట్ హాట్ ఫోటోస్

తెలుగమ్మాయి ఈషా రెబ్బా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంది. తెలుగులో హీరోయిన్లు అరుదుగా వస్తూ ఉంటారు. ఈషా రెబ్బా తన టాలెంట్ తో

చిరంజీవి 'కింగ్ మేకర్'.. ఇదే ఫైనల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య షూటింగ్ ఇంకా కొంత భాగం మిగిలి ఉంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్ షూటింగ్ నిలిపివేశారు.