ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా కొవిడ్ వైరస్‌ను చూడాలనుకుంటున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్ అనేది ఓ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా బుల్లెట్‌నే చూపిస్తామంటున్నారు కొందరు నిపుణులు. దీనిని ఓ మ్యూజియంలో.. వైరస్‌ను ముఖాముఖి చూపిస్తున్నారు. అమ్మో కరోనా వైరస్‌ను ముఖాముఖి చూడటమా? అనుకుంటున్నారా? ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగా కనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒక వైరస్‌ను చూస్తున్న ఫీలింగ్ అయితే రాదు.. మన కళ్లెదుట ఒక అందమైన దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది.
ఆక్స్‌ఫర్డ్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోవిడ్ 19 వైరస్‌ను ముఖాముఖిగా చూడొచ్చు. వైరస్ ఉందంటేనే ఆ ఏరియాకే వెళ్లడానికి సంకోచిస్తాం కదా.. ఈ మ్యూజియంలో మాత్రం ఫేస్ టు ఫేస్ చూసేయవచ్చు. అసలైన వైరస్ పరిమాణం కంటే ఇది 80,00,000 రెట్లు పెద్దది. ఎంతో భయం గొలిపే వైరస్‌ను ఇక్కడ దగ్గరి నుంచి చూడొచ్చు. ఇది ఎంత భయాన్ని కలిగిస్తుందో అంత అందంగాను కనిపిస్తుంది. కొన్ని లక్షల సైంటిఫిక్ డేటాతో వైరస్ కళాకృతిని రూపొందించారు.
ఈ కళాకృతిని రూపొందించిన నిపుణుల్లో ఒకరు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత చూసి ఎంతో ఆశ్చర్యపోయామన్నారు. కొవిడ్ 19 వైరస్ ఎంతో భయంకరమైనదని.. అది ప్రపంచాన్ని గడగడలాడిస్తోందనే వార్తలను వింటూనే ఈ కళాకృతిని రూపొందించామని తెలిపారు. ఆశ్చర్యంగా అది చాలా అందంగా రూపుదద్దుకుందని వెల్లడించారు. ఒక గాజు బాక్సులో బంధీగా ఉన్న ఈ కొవిడ్ వైరస్.. మనలోని భయాందోళనను దూరం చేసి.. దాని సౌందర్యంపైనే దృష్టి సారించేలా చేస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com