'బాహుబలి 2' టికెట్ కావాలా నాయనా...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ టైటిల్ పాత్రలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్‌పై ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్న భారీ బడ్జెట్ విజువల్ వండర్ బాహుబలి 2. ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ముఖ్యంగా బాలీవుడ్లో బాహుబలి 2 చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ఫై కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. హిందీలో సినిమాపై అంచనాలను పెంచడానికి కరణ్ జోహార్ ప్టార్ 1..బాహుబలి ది బిగినింగ్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు పార్ట్ 1 సినిమాను చూసే ప్రేక్షకులకు బాహుబలి 2 టికెట్‌ను ఇస్తారట. అయితే ఇది కేవలం హిందీకి మాత్రమే పరిమితం. హిందీలో బాహుబలి ది బిగినింగ్ ఏప్రిల్ 7 నుండి 17వరకు సందడి చేయబోతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com