Pawan Kalyan:పవన్ కల్యాణ్ చేతికి రెండు ఉంగరాలు.. ఎందుకో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈమధ్య తన కుడి చేతికి రెండు బంగారు ఉంగరాలు పెట్టుకుని కనిపిస్తున్నారు. దీంతో ఆయన ఈ ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారు అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ రెండు ఉంగరాల్లో ఒకటి తాబేలు ఉంగరం, రెండోది నాగ ప్రతిమ ఉంగరం ధరించారు. వీటిపై జాతక నిపుణులు స్పందిస్తూ తమ వివరణ ఇచ్చారు.
"పవన్ కల్యాణ్ జాతకం పరంగా చూస్తే... ఆయన పుట్టింది 1971 సెప్టెంబరు 2. కుజ రాహువు సంధి, రాహు కేతువులకు సంబంధించిన కొన్ని దోషాలు ఉన్నాయి. ఆయనది మకర రాశి. మకర రాశిలోనే కుజుడు, రాహువు, చంద్రుడు ఉన్నాడు. చంద్ర మంగళ యోగం ఉన్నప్పటికీ, కుజ రాహువు సంధి ప్రభావం ఉండడం వల్ల ఆయన నాగబంధం ఉన్న ఉంగరాన్ని ధరించడం చాలా కలిసొచ్చే అంశం. జాతకపరంగా ఆయన ధరించిన ఉంగరాలు సత్ఫలితాలను ఇస్తాయి.
కుటుంబంలో ఇబ్బందులు ఉన్నవారు, నర ఘోష, నర దృష్టి ఎక్కువగా ఉన్నవారు, రాజకీయ పరమైన ఇబ్బందులు ఉన్నవారు ఈ నాగబంధం ఉన్న ఉంగరం ధరిస్తారు. రెండోది కూర్మావతార ఉంగరం. ఇది తాబేలు ప్రతిమను కలిగి ఉంటుంది. ఎదుగుదలకు, అధికారానికి, ప్రజాకర్షణకు సూచనగా ఈ ఉంగరం గురించి జ్యోతిష శాస్త్రంలో చెబుతారు" అని వివరించారు. దీంతో జ్యోతిష్యుల సూచన మేరకు పవన్ ఈ రెండు ఉంగరాలు ధరించి ఉంటారని చెబుతున్నారు.
కాగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. కొంత వాస్తు శాస్త్రం, కొంత మంది జ్యోతిష్య శాస్త్రం పాటిస్తారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎక్కువగా వాస్తును నమ్ముతూ ఉంటారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చేతికి ఉంగరం పెట్టుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. అక్కడి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాను భీమవరం నుంచి పోటీ చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈసారి ఇక్కడే గెలిచి చూపించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉండటంతో ఆ పార్టీ ఓట్లు కూడా కలిసివస్తాయని భావిస్తున్నారు. దీంతో తమ నాయకుడు ఈసారి అసెంబ్లీలో కాలు మోపం ఖాయమని జనసైనికులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments