రోహిత్ శెట్టి కారు ధ‌ర ఎంతో తెలుసా?

  • IndiaGlitz, [Friday,November 08 2019]

బాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ప్రేక్ష‌కులు మెప్పించేలా సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి. ఈయ‌న ఇప్పుడు మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. అయితే ఈసారి త‌న సినిమాతో కాదు.. త‌న కారుతో. అస‌లు విష‌య‌మేమంటే రీసెంట్‌గా రోహిత్ శెట్టి ఓ కారును కొన్నాడ‌ట‌. ఆ కారు ధ‌ర ఎంతో తెలుసా? అక్ష‌రాలా మూడు కోట్ల రూపాయ‌లు. ఇప్పుడు ఈ కారు ధ‌ర బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స‌ద‌రు కారు కంపెనీ కారుతో పాటు రోహిత్ శెట్టి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. ''అసాధార‌ణ వ్య‌క్తులు కోసం అసాధార‌ణ కారు. మ‌న దేశంలోని వ్య‌క్తుల కోసం. మ‌న దేశంలో విజ‌య‌వంత‌మైన వ్యక్తులంద‌రూ ఈ కారును కొన‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ అసాధార‌ణ‌మైన కారు ఆయ‌న వ్య‌క్తిత్వానికి ప్ర‌తీక‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇటీవ‌ల టెంప‌ర్ రీమేక్‌ను ర‌ణ‌వీర్ సింగ్‌తో 'సింబా'గా రీమేక్ చేసి హిట్ కొట్టారు రోహిత్ శెట్టి.. ఇప్పుడు అక్ష‌య్‌కుమార్‌తో 'సూర్య‌వ‌న్షీ' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇదొక యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమాలో క‌త్రినా కైఫ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శక నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.