same sex marriages:ఏ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత ఉందో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. LGBTQIA+ వర్గాలకు చెందిన వ్యక్తుల వివాహానికి తాము చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది. తమ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని 20 స్వలింగ జంటలు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. దీనిపై పార్లమెంటే చట్టం చేయాలన్న ధర్మాసనం.. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్ష చూపొద్దని వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో దేశంలో మరోసారి స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత అంశం ట్రెండింగ్‌లో ఉంది.
తొలి దేశం నెదర్లాండ్స్.. 30కి పైగా దేశాల్లో చట్టబద్ధత..
అయితే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత ఉంది. స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం నెదర్లాండ్స్. 2000లో దీనిపై అక్కడ ఉద్యమం ప్రారంభం కాగా.. 2001లో నెదర్లాండ్స్ ప్రభుత్వం దీనికి చట్టబద్ధత కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్ ల్యాండ్, అర్జెంటీనా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, లక్సెంబర్గ్, ఐర్లాండ్, అమెరికా, ఫిన్‌ల్యాండ్, జర్మనీ, మల్టా, ఆస్ట్రేలియా, తైవాన్, ఈక్వెటార్, ఆస్ట్రియా, ఐర్లాండ్, కోస్టారికా, చిలీ, క్యూబా, స్విడ్జర్లాండ్, మెక్సికో, స్లొవేనియా, అండోరా, ఎస్టోనియా దేశాలు కూడా స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి.
2001లో భారత్‌లో తెరపైకి వచ్చిన స్వలింగ వివాహాల అంశం..
కానీ భారత్‌తో పాటు మెజార్టీ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు. అక్కడ ఈ వివాహాలను నేరంగా పరిగణిస్తారు. నైజీరియాతో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అరబ్ దేశాలు అయితే స్వలింగ వివాహాలు చేసుకున్న వారిని జైలుకు కూడా పంపించాయి. నెదర్లాండ్స్ దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత రావడంతో భారత్‌లో కూడా 2001లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత గురించి చర్చ తెరపైకి వచ్చింది. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలంటూ ‘నాజ్’ ఫౌండేషన్ మొట్టమొదటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం 2001లో దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు 2004లో దానిని డిస్మిస్ చేసింది. అదే ఢిల్లీ హైకోర్టు 2009లో స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు చెప్పింది. 2013లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరమేనని తేల్చిచెప్పింది. ఇక అప్పటి నుంచి ఈ అంశంపై చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఈ వివాహాలకు చట్టబద్ధతను వ్యతిరేకిస్తూ తీర్పు ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com