Hi Nanna Director: నాని 'హాయ్ నాన్న' డైరెక్టర్.. ఫేమస్ యూట్యూబర్ అన్నయ్య అని తెలుసా..?

  • IndiaGlitz, [Tuesday,November 14 2023]

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథ నచ్చితే చాలు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. అలాగే పలు సినిమాలను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శౌర్యువ్ అనే వ్యక్తికి కూడా దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. అయితే తాజాగా ఈ దర్శకుడి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన నిఖిల్‌కు స్వయానా అన్నయ్య అవుతాడు.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యాడు నిఖిల్. సెలబ్రిటీలని ఇంటర్వ్యూలు చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఇలా మంచు లక్ష్మి, నిహారిక, వితిక.. మరికొంత మంది సెలబ్రెటీలకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు. ముఖ్యంగా మెగా డాక్టర్ నిహారిక, సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రియతో ఎక్కువగా కనబడుతూ ఉంటాడు. సుప్రియతో రిలేషన్‌లో ఉన్నాడనే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా నిఖిల్ బర్త్‌డే సందర్భంగా శౌర్యువ్ విషెస్ చెబుతూ ఓ పోస్ట్ చేశాడు. ఇందులో హ్యాపీ బర్త్‌ డే రా తమ్ముడు అని తెలిపాడు. దీంతో వీరిద్దరు అన్నదమ్ములు అనే విషయం వైరల్ అయింది.

తమ్ముడు నిఖిల్ యాక్టింగ్, యాంకరింగ్‌ వైపు వెళ్లి సక్సెస్ అవ్వగా.. అన్నయ్య శౌర్యువ్ డైరెక్షన్ వైపు మళ్లాడు. తొలి చిత్రంతోనే స్టార్ హీరో నానితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఫ్యామిలీతో పాటు యువతను బాగా ఆకట్టుకున్నాయి. కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ నానికి జోడీగా నటిస్తుంది. ఇక ఖుషి మూవీకి అదిరిపోయే పాటలు ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మూవీకి కూడా సంగీతం అందించాడు. డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

Drohi Review: మర్డర్ చుట్టూ తిరిగే 'ద్రోహి'.. మూవీ రివ్యూ

అజయ్ (హీరో సందీప్) ఒక వ్యాపారవేత్త. తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి రకరకాల వ్యాపారాలు చేస్తే వుంటాడు. ఎంత కష్టపడుతున్నా.. ఎఫర్ట్ పెడుతున్నా బిజినెస్‌లో నష్టపోవడమే కానీ కలిసి రావడం మాత్రం జరగదు.

Anukunnavanni Jaragavu Konni: 'అనుకున్నవన్నీ జరగవు కొన్ని' మూవీ రివ్యూ

కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన ఓటీటీ కారణంగా ప్రపంచం నలుమూలలా వున్

KCR: వైఎస్ షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

Tula Uma: బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు.

Rahul Gandhi: గెలుపు కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఆరు రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.