CM KCR:సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు ఎంత చూపించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమితో పాటు కారు కూడా లేదని తెలిపారు.
ఆస్తుల వివరాలు ఇవిగో..
మొత్తం ఆస్తులు : రూ. 58.17 కోట్లు
చరాస్తులు : రూ. 35.42 కోట్లు (నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు)
కేసీఆర్ పేరిట అప్పు : రూ. 17.12 కోట్లు
కుటుంబం అప్పు : రూ. 7.23 కోట్లు
ఏడాదికి ఆదాయం: రూ. 1.60 కోట్లు
సాగు భూమి : 53.30 ఎకరాలు
వ్యవసాయేతర భూమి : .36 ఎకరాలు
శోభ పేరిట చరాస్తులు : రూ. 7.78 కోట్లు
ఉమ్మడి చరాస్తులు : రూ. 9.81 కోట్లు.
ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు (విలువ కోటీ 16 లక్షలు)
కేసులు: ఉద్యమం సమయంలో 9 కేసులు
కార్లు, వ్యవసాయ భూములు లేవు
2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో మొత్తం చరాస్తుల విలువ 10.40 కోట్లు.. స్థిరాస్తులు 12.20 కోట్లుగా చూపించగా.. ఇప్పుడు వాటి విలువ రెట్టింపు అయినట్లు తెలిపారు. కేసీఆర్ పేరు మీద వ్యవసాయ భూమి లేదని తెలిసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout