CM KCR:సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంతో తెలుసా..?

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు ఎంత చూపించారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమితో పాటు కారు కూడా లేదని తెలిపారు.

ఆస్తుల వివరాలు ఇవిగో..

మొత్తం ఆస్తులు : రూ. 58.17 కోట్లు

చరాస్తులు : రూ. 35.42 కోట్లు (నగదు, డిపాజిట్లు, టీ-న్యూస్‌లో పెట్టుబడులు)

కేసీఆర్ పేరిట అప్పు : రూ. 17.12 కోట్లు

కుటుంబం అప్పు : రూ. 7.23 కోట్లు

ఏడాదికి ఆదాయం: రూ. 1.60 కోట్లు

సాగు భూమి : 53.30 ఎకరాలు

వ్యవసాయేతర భూమి : .36 ఎకరాలు

శోభ పేరిట చరాస్తులు : రూ. 7.78 కోట్లు

ఉమ్మడి చరాస్తులు : రూ. 9.81 కోట్లు.

ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీల్లాంటి 14 వాహనాలు (విలువ కోటీ 16 లక్షలు)

కేసులు: ఉద్యమం సమయంలో 9 కేసులు

కార్లు, వ్యవసాయ భూములు లేవు

2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్‌లో మొత్తం చరాస్తుల విలువ 10.40 కోట్లు.. స్థిరాస్తులు 12.20 కోట్లుగా చూపించగా.. ఇప్పుడు వాటి విలువ రెట్టింపు అయినట్లు తెలిపారు. కేసీఆర్ పేరు మీద వ్యవసాయ భూమి లేదని తెలిసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

More News

Prabhas:ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 'సలార్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పోస్టర్స్,

TRAI :ఇకపై స్పామ్ కాల్స్, సందేశాలకు చెక్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు స్పామ్ కాల్స్, మెసేజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత అసహనానికి ఫీల్ అవుతూ ఉంటారు.

CM KCR:అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా: సీఎం కేసీఆర్

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ తనను చాలా సార్లు కోరారని అందుకే పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

Achchennaidu:త్వరలోనే టీడీపీ-జనసేన మేనిఫెస్టో ఖరారుచేస్తాం: అచ్చెన్నాయుడు

ఈనెల 17 నుంచి టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతాయని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

Mogalirekulu Sagar:జనసేన ప్రచార కార్యదర్శిగా 'మొగలిరేకులు' సాగర్ నియామకం

ఇటీవల జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ ములుకుంట్ల సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో