ఆక్సిజన్‌కు బదులుగా నెబ్యులైజర్ వాడకండి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రతిరోజూ దేశంలో ఏదో ఒక చోట పదుల సంఖ్యలో జనం మరణిస్తూనే ఉన్నారు. ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల సామర్థ్యం పెంచడంతో పాటు తాత్కాలిక ప్లాంట్లను నెలకొల్లేందుకు చర్యలు తీసుకొంటోంది. అయితే తాజాగా ఆక్సిజన్ కొరతకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అత్యవసర సమయంలో ఆక్సిజన్ సిలిండర్ లేనప్పుడు ప్రత్యా మ్నాయంగా నెబ్యులైజర్‌ను వాడుకోవచ్చనే వార్త వైరల్ అవుతోంది.
ఆక్సిజన్ సిలిండర్ లేని సమయంలో ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్‌ను ఎలా వినియోగించుకోవాలో డాక్టర్ అలోక్ సేథి అనే మెడికల్ ప్రాక్టీషనర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి ఇదొక చక్కని పరిష్కారంగా భావించిన నెటిజన్లు దీనిని బాగా వైరల్ చేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఇలాంటి పనులు చేయవద్దని.. ఆక్సిజన్‌కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదంటున్నారు. ఇది ప్రత్యేక ద్రవం నుంచిఅల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ద్వారా ఆవిరిని మాత్రమే ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు.
ఆస్తమా బాధితులకు వాయునాళంలో అవాంతరాలు సరిచేసి ఊపిరాడేలా చేసేందుకు ఈ పరికరాన్ని వాడతారని.. దీని కారణంగా ప్రత్యేకంగా ఆక్సిజన్ ఏమీ ఉత్పత్తి కాదని.. అవగాహన లేకుండా దీన్ని వినియోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన వీడియోపై అలోక్ సేథి తాజాగా వివరణ ఇచ్చారు. తాను ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ వాడమని చెప్పలేదని.. నెబ్యులైజర్ ఎలా వాడాలో వీడియో ద్వారా ఓ వ్యక్తికి వివరించానని.. అది వైరల్ అయ్యిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వీడియోలు వైరల్ చేసి గందరగోళం సృష్టించవద్దని అలోక్ నెటిజన్లను కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments