కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దు: రఘురామ
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ పాదయాత్ర వేడుకలకు లేని కరోనా అడ్డంకి.. ఎన్నికల నిర్వహణకు ఎందుకని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి అధికారులు, పోలీస్ సిబ్బంది ముందుకు రాకుండా.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని రఘురామ హితవు పలికారు. ఎన్నికలు అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీకి 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి.. ఏం చేసినా చెల్లుతుందనే భావన తమ నాయకుల్లో కనిపిస్తోందన్నారు.
ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ లేఖ రాయడం బాధ్యతారాహిత్యమని రఘురామ కృష్ణరాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా కోరడం.. రాజ్యాంగ సంస్థలను విచ్ఛిన్నం చేయడానికి నిదర్శనమని రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణపై గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కోర్టులు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించమని ఆదేశించవచ్చని పేర్కొన్నారు.
కాగా.. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ పార్టీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ క్రమంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సాధ్యం కాదని నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు, అధికారులు కరోనా విధుల్లో ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు తెలియజేస్తామని లేఖ రాశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout