వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగొద్దు: హైకోర్టు
Send us your feedback to audioarticles@vaarta.com
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నేడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి చట్టం లేకుండా ధరణిలో ఆస్తుల నమోదుతోపాటు.. కులం, ఆధార్ వంటి వివరాలను అడగటాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు సాకేత్, గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలను తొలిగించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్లాట్ బుకింగ్, పీటీఐఎన్‌ను సాఫ్ట్‌వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకూ నిలిపివేయాలని ప్రభుత్వానికి సూచించింది.
కులం, కుటుంబ సభ్యుల వివరాలపై కూడా హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఆ వివరాలను సైతం తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ వివరాలు మినహా ఇతర గుర్తింపు పత్రాలను అడగొచ్చని ప్రభుత్వం సూచించింది. న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని.. ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సవరణకు వారం రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం, హైకోర్టును కోరింది ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు జనవరి 20కి వాయిదా వేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout