DK Aruna:కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై తేల్చి చెప్పిన డీకే అరుణ..
Send us your feedback to audioarticles@vaarta.com
తాను పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని.. బీజేపీ అధిష్ఠానం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలని అరుణ వెల్లడించారు.
సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్న నేతలు..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీలో చేరతారో ఊహించడం కష్టమౌతుంది. మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉంటున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. సర్వేలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండడంతో ఇతర పార్టీల్లోని కీలక నేతలు హస్తం కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేతలు మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బీజేపీకి డీకే అరుణ రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం..
తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ సైతం కమలం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని.. హస్తం పార్టీ పెద్దల నుంచి సష్టమైన హామీ రావడంతో ఆమె సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మక్తల్ లేదా దేవరకద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ వార్తలను డీకే అరుణ ఖండించారు. దీంతో ఆమె పార్టీ మార్పుపై ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.
గద్వాల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం..
కాగా గద్వాల నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో డీకే అరుణ హ్యాట్రిక్ విజయం సాధించారు. దివంగత సీఎంలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో మంత్రిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఇంకా కోలుకోవడం కష్టమని భావించిన ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments