'డి.జె.దువ్వాడ జగన్నాథమ్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...
Send us your feedback to audioarticles@vaarta.com
`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విశేషాలను నిర్మాత దిల్‌రాజు తెలియజేశారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుందనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలుంటాయి. అలాంటిది ఆర్య, పరుగు చిత్రాలు తర్వాత అల్లుఅర్జున్ మా బ్యానర్లో చేస్తున్న సినిమా కావడం ఒకటైతే, గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ సాధించిన హరీష్ శంకర్ మా బ్యానర్లో సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం తర్వాత మా బ్యానర్లో హరీష్ శంకర్ డైరెక్షన్ చేస్తున్న మూవీ కావడం, `ఆర్య`, `బన్ని`, `ఆర్య2`, `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాలు కమర్షియల్‌గా సూపర్‌హిట్ కావడమే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి అలాంటి హిట్ కాంబో బన్ని, దేవి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేం కూడా చాలా ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్నాం.
ఇటు ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు అతృతగా ఎదురుచూస్తున్న డి.జె.దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్‌లుక్‌ను ఈ ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నాం. అలాగే మహాశివరాత్రి సందర్భంగా టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం సినిమా కర్ణాటకలో చిత్రీకరణ జరుపుకుంటుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఈ ఫిబ్రవరి నెలాఖరున అబుదాబిలో షూట్ చేస్తున్నాం. అందరి అంచనాలను మించేలా ఈ చిత్రాన్ని అన్ కాంప్రమైజ్డ్గా తెరకెక్కిస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్ రాజ్ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments