దీక్షిత్‌ను కిడ్నాప్ చేసిన గంటన్నరకే చంపేశారు: ఎస్పీ కోటిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్, హత్యకేసును పోలీసులు ఛేదించారు. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మంద సాగర్ అనే వ్యక్తి దీక్షిత్‌ని కిడ్నాప్ చేశాడని వెల్లడించారు. కిడ్నాప్ చేసిన గంటన్నరకే బాలుడిని గొంతు నులిమి హత్య చేశారని తెలిపారు. చంపిన విషయాన్ని దాచి రూ.45 లక్షలు డిమాండ్ చేశారని కోటిరెడ్డి వెల్లడించారు.
‘‘ఆదివారం సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై వచ్చి దీక్షిత్‌రెడ్డిని మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసేందుకు ముందుగానే రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. అయినా... మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో మందసాగర్ ద్విచక్రవాహనంపై దీక్షిత్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్‌గా పనిచేసే మంద సాగర్ దీక్షిత్‌రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడు. కిడ్నాప్ చేసిన తర్వాత డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినా.. ఆ తర్వాత దొరికి పోతామనే భయంతో బాలుడి గొంతు నులిమి చంపేశాడు.
కిడ్నాప్ చేసిన గంటన్నరకే గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత అన్నారం శివారులోని గుట్టపైకి మృత దేహాన్ని తీసుకెళ్లారు. చంపిన విషయం దాచిపెట్టి బాలుడిని విడిచిపెట్టేందుకు రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. చంపిన తర్వాత కూడా రెండ్రోజుల పాటు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను పట్టుకున్నాం. మందసాగర్‌తో పాటు మనోజ్‌రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతని పాత్రపై కూడా విచారణ జరుపుతున్నాం. నిందితులు ఇంటర్నెట్ కాల్స్ చేసినా హైదరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్‌ఫోర్స్ సాయంతో ఛేదించాం. నిందితుడి ఎన్కౌంటర్ జరగలేదు. దర్యాప్తు అనంతరం ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments