దీక్షిత్ కేసు: ఏడాదిగా డింగ్ టాక్ యాప్ వాడుతున్న నిందితుడు
Send us your feedback to audioarticles@vaarta.com
దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు రూపొందించారు. ఈ రిపోర్టులో పలు విషయాలను పేర్కొన్నారు. ఏడాది నుంచి నిందితుడు డింగ్ టాక్ యాప్ వాడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారానే బాలుడి తల్లిదండ్రులకు మంద సాగర్ ఫోన్ చేశాడు. పెట్రోల్ బంక్‌కు వెళ్దామని బాలుడిని మందసాగర్ తీసుకెళ్లాడు. తెలిసిన వ్యక్తి కావడంతో పిలవగానే బాలుడు సాగర్‌తో వెళ్లాడు. ఈ క్రమంలోనే మంచి నీళ్లలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో నిందితుడు తాగించాడు.
బాబు స్పృహలోకి వచ్చేలోపే నిందితుడు గొంతు నులిమి హత్య చేసేశాడు. ఆ తరువాత డింగ్ టాక్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పోలీసులు ఫాలో అవుతున్నారని అనుమానంతో.. బాలుడి తండ్రి రంజిత్‌రెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణాన్ని మంద సాగర్ నడుపుతున్నాడు. తల్లిదండ్రులు కిడ్నాప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే.. బాలుడిని మంద సాగర్ హతమార్చాడు.
జర్నలిస్టు రంజిత్‌రెడ్డి కుమారుడే దీక్షిత్‌రెడ్డి(9). గత ఆదివారం రాత్రి దీక్షిత్‌ని మంద సాగర్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన ఆదివారం రాత్రే గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే మంద సాగర్ బాలుడిని హత్య చేశాడు. ఆ తరువాత రోజు నుంచి తనకేమీ తెలియనట్టు మూడు కొట్ల సెంటర్లోని తన ఆటో మొబైల్ షాపును నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా.. ఆ రోజు నుంచి బుధవారం తెల్లవారుజాము దాకా దీక్షిత్ తల్లి వసంతకు పలుమార్లు ఇంటర్నెట్ కాల్ ద్వారా రూ.45 లక్షలు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో జనంలోనే తిరుగుతూ అన్నీ పరిశీలిస్తూ వస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com