Divyavani : ఈటల రాజేందర్‌తో దివ్యవాణి భేటీ.. త్వరలో బీజేపీలోకి, సౌత్‌లో ఎక్కడైనా రెడీ అంటూ సంకేతాలు

  • IndiaGlitz, [Thursday,September 08 2022]

అలనాటి సినీనటి దివ్యవాణి గురువారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈరోజు హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని రాజేందర్ ఇంటికి వెళ్లిన దివ్యవాణి ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం దివ్యవాణి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాల్సిందిగా తనను ఆ పార్టీ నేతలు సంప్రదించారని, ఈ నేపథ్యంలోనే చేరికల కమిటీ కన్వీనర్‌గా వున్న రాజేందర్‌తో భేటీ అయ్యానని చెప్పారు. బీజేపీలో చేరే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని దివ్యవాణి వెల్లడించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగానే వుందని.. తనకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోనూ అనుబంధం వుందన్నారు. ఈ క్రమంలో దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పనిచేస్తానని.. బీజేపీని బలోపేతం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని దివ్యవాణి వెల్లడించారు.

వెళ్తూ వెళ్తూ టీడీపీపై విమర్శలు:

నిన్న మొన్నటి వరకు ఏపీ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌గా చంద్రబాబును కానీ, నారా లోకేష్‌ను ఎవరైనా ఏమైనా అంటే విరుచుకుపడేవారు సినీనటి దివ్యవాణి. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వెళుతూ వెళుతూ.. తనను టీడీపీ నేతలు మోసం చేశారని, అక్కడ ఓ వర్గం వారిది మాత్రమే పెత్తనమని, వారికే ప్రాధాన్యత ఇస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు దివ్యవాణి. దీంతో ఆమెపై కొందరు వైసీపీ కోవర్ట్ అనే ముద్ర వేశారు. అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే కొన్నిరోజులుగా సైలెంట్‌గా వున్న దివ్యవాణి ఏదో ఒక పార్టీలోకి చేరాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

సినీ స్టార్స్‌ని దువ్వే పనిలో బీజేపీ :

మరోవైపు.. భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినీ నటుల ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్‌తో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. త్వరలో మరికొందరు సినీ ప్రముఖులతో సమావేశమై వారిని పార్టీలోకి ఆహ్వానించాలని, లేదంటే మద్ధతు పొందాలని బీజేపీ భావిస్తోంది.

More News

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని

ఏం జరిగినా ఇద్దరికీ వర్తిస్తుంది.. ఎలిమినేషన్ కూడా, రోహిత్- మేరీనాలకు షాకిచ్చిన బిగ్‌బాస్

నిన్నటి ఎపిసోడ్‌లో క్లాస్, మాస్, ట్రాష్.. టాస్క్ ముగించిన బిగ్‌బాస్ నామినేషన్లకు తెరదీసిన సంగతి తెలిసిందే.

Delhi Firecracker Ban : సైలెన్స్ ప్లీజ్.. ఢిల్లీలో బాణాసంచా కాల్పులపై ఈ ఏడాది కూడా నిషేధం

భారతీయులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగల్లో దీపావళి ముందు వరుసలో వుంటుంది.

అన్నగారిలానే పవన్‌ది బలమైన ఆశయం.. ఆయన కల నెరవేరాలి : పరుచూరి గోపాలకృష్ణ

పవన్ కల్యాణ్.. సినిమాల్లో పవర్‌స్టార్, రాజకీయాల్లో జనసేనాని. సినిమాలను తగ్గించి నాయకుడిగా మారినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

Captain: 'కెప్టెన్' ప్రీ రిలీజ్

ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం.