close
Choose your channels

ఆర్జీవీకి దమ్ముంటే... : దివ్యవాణి చాలెంజ్

Tuesday, April 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్జీవీకి దమ్ముంటే... : దివ్యవాణి చాలెంజ్

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు అలనాటి నటి, టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఛాలెంజ్ చేశారు. ఇటీవల విజయవాడలో ఏడు గంటల పాటు ఆర్జీవీ చేసిన హంగామా, ఆయనకు వత్తాసు పలికిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. తెలుగు రాష్ట్రాల సమస్యలపై స్పందించని వైఎస్ జగన్.. బూతు సినీ డైరెక్టర్ గురించి స్పందించడం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు. బూతు డైరెక్టర్ వర్మని అడ్డుకుని పోలీసులు మంచిపని చేశారని ఆమె ఖాకీలకు కితాబిచ్చారు. అంతటితో ఆగని ఆమె.. మీడియా ముఖంగా ఆర్జీవీకి సవాల్ విసిరారు.

ఆర్జీవీకి దమ్ముంటే...

రామ్‌గోపాల్ వర్మకు దమ్ముంటే వైఎస్ జగన్ ఇంట జరిగిన హత్యా రాజకీయాలపై సినిమా తీయాలని సవాల్ చేశారు. టీడీపీ అధిపతి చంద్రబాబుతో వర్మ దేనికీ సరిపోని వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. ముందు సమస్యను సమస్యగా మాట్లాడడం వర్మ నేర్చుకోవాలని ఆర్జీవీకి హితవు పలికారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏమీ లేదని ఆమె చెప్పుకొచ్చారు. దెయ్యాలు లేవు.. దేవుళ్లు లేవు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి చెప్పిందని అందుకే సినిమా తీస్తున్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్‌గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం!.. ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మీ సినిమా సంకనాకిపోయిందన్న సంగతి అందరికీ తెలుసని విమర్శలు గుప్పించారు.

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment