సూర్య నిర్ణయం డిస్ట్రిబ్యూటర్స్ ఫైర్.. డైరెక్టర్ హరి లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
సూర్య.. తనే హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘శూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో థియేటర్స్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ.. చివరకు సూర్య ఓటీటీ వైపు మొగ్గారు. అమెజాన్ ప్రైమ్‌లో ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయబోతున్నట్లు... ఈసినిమా నుండి జరిగిన బిజినెస్‌లో రూ.5కోట్లను కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయనున్నట్లు సూర్య తెలియచేసిన సంగతి తెలిసిందే.
అయితే సూర్య నిర్ణయంపై కోలీవుడ్ పరిశ్రమకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది వరకు జ్యోతిక సినిమాను ఓటీటీలో సూర్య విడుదల చేసినప్పుడు ఆయన తీరుపై డిస్ట్రిబ్యూటర్స్ మండిపడ్డారు. ఇప్పుడు ఆ కోపం మరింత ఎక్కువైంది. సూర్య సినిమాలను భవిష్యత్తులో థియేటర్స్‌లో విడుదల చేయనీయమని వారు అంటున్నారు. ఈ తరుణంలో సూర్యతో సింగం సిరీస్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ హరి.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మద్దతు పలికారు. సినిమా ఇండస్ట్రీకి డిస్ట్రిబ్యూటర్స్ గుండెలాంటివాళ్లని, హీరోగా సూర్య స్థాయి పెరగడంలో వారి పాత్ర ఏంతో ఉందని చెప్పిన హరి.. సూర్యను నిర్ణయం మార్చుకోవాలని సూచించారు. మరి సూర్య ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments