శాతకర్ణితో మాకు శుభారంభం: డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
రోజురోజుకూ "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రానికి ఆదరణతోపాటు థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూలు పెరుగుతుండడంతో మా డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు నిజమైన సంక్రాంతి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కలెక్షన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతుండడం మాకు ఎక్కడలేని ఆనందాన్ని కలిగిస్తోందని "గౌతమిపుత్ర శాతకర్ణి" డిస్ట్రిబ్యూటర్లు-బయ్యర్లు సంతోషం వ్యక్తం చేశారు.
సీడెడ్/వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. "బాలయ్యకు కంచు కోట సీడెడ్ ఏరియా రైట్స్ ను కావాలనే తీసుకోవడం జరిగింది. ఆదివారంతో మాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ ఏరియాలోని ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసర్స్ లో ఒకటిగా "గౌతమిపుత్ర శాతకర్ణి" నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు" అన్నారు.
కృష్ణ/గుంటూరు డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ మాట్లాడుతూ.. "బాలకృష్ణ గారి 100వ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జనాల్లో సినిమా గురించి వస్తున్న రెస్పాన్స్ తో నేను పెట్టిన సొమ్ము సేఫ్ అని సంతోషంగా చెప్పగలను" అన్నారు.
నైజాం డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "శాతకర్ణి ఈ స్థాయి విజయం సాధిస్తుందని నేను ముందే ఊహించాను. నేడు నా మాట వాస్తవం అయినందుకు గర్వంగా ఉంది. సోమవారం నుంచి ఓవర్ల్ ఫ్లోస్ ఉంటాయి" అన్నారు.
ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు, వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్.వి.ఆర్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ భరత్ కుమార్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సృజన్ తదితరులు మాట్లాడుతూ.. "ఇప్పటికే ఓవర్ ఫ్లోస్ స్టార్ట్ అయ్యాయి. ఈ రేంజ్ క్రౌడ్ ను అస్సలు ఎక్స్ ఫెక్ట్ చేయలేదు. రెండోవారంలో స్క్రీన్స్ కూడా పెంచాలేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. సినిమాలో ప్రతి డైలాగ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే ఒన్ మిలియన్ మైల్ స్టోన్ దాటింది. జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా ఒక తెలుగు సినిమా అయిన "గౌతమిపుత్ర శాతకర్ణి"కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది" అన్నారు.
తమకు ఎంతగానో సహరించిన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు చిత్ర నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ లు కృతజ్ణతలు వ్యక్తం చేశారు. అలాగే.. తమ చిత్రాన్ని ఈస్థాయిలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments