జులై 19 న డిస్నీ లయన్ కింగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు.
అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది.
ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments