షాకింగ్: ఏపీలోనూ ‘దిశ’ లాంటి ఘటనే!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ‘దిశ ఘటన’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ నలుగురు నిందితులు సీన్ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపైకి రివర్స్ అవ్వడంతో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. కాగా.. ఈ ఘటన అనంతరం తెలంగాణలో.. అటు ఏపీలో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా.. ఏపీలో అయితే ఏకంగా దిశ పేరుతోనే ‘ఏపీ దిశచట్టం’ను తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టంను తీసుకొచ్చిన కొన్ని గంటల వ్యవధిలో, ఆ మరుసటి రోజే నేరాలు ఘోరాలు జరిగిపోయాయ్. అయితే తాజాగా ఏపీలోనూ దిశ ఘటన జరిగిందని ఈ వార్తను బట్టిచూస్తే తెలుస్తోంది. అసలేం జరిగింది..? ఏపీలో ఈ ఘటన జరిగింది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేం జరిగింది!?
తెలంగాణలో దిశ ఘటన మరువక ముందే.. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు రూరల్ పరిధిలోని చవటపాలెం ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే 23 ఏళ్ల యువతిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి.. అతి కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. ఈ దారుణ ఘటన చవటపాలెం గ్రామ సచివాలయం సమీపంలోనే చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృతదేహంపై దుస్తులు లేకపోవడం, తలపై రాడ్డుతో కొట్టిన గాయాలు ఉండటంతో దిశలాంటి ఘటనే జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారనే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది.
ఎలా జరిగింది!?
పూర్తి వివరాల్లోకెళితే.. జిల్లాలోని చవటపాలెంలో ఆదివారం రాత్రి దోస పిండి కోసం ఓ యువతి బయటికెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు బంధువులు, చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికారు. అయితే.. తీరా చూస్తే ఓ చోట మృతదేహం కనపడింది. ఆ యువతి తమ బిడ్డేనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఊర్లో తిరిగినట్టు తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడింది వాళ్లేనని.. వారిని పట్టుకోవడానికి ఓ వైపు పోలీసులు.. మరోవైపు స్థానికులు వేట మొదలుపెట్టారు. మరి ఈ ఘటనపై పోలీసులు మీడియా మీట్ పెట్టి అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments