దిశా రహస్య వివాహం?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్‌లో పెళ్ళిళ్ళ సీజన్ మొదైలెనట్టు కనిపిస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లి, అనుష్క శర్మ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఇటలీలో రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరిలాగే టైగర్ ష్రాఫ్, దిశా పటాని కూడా రహస్యంగా పెళ్ళి చేసుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిద్దరూ గత కొంతకాలంగాఎక్కడికి వెళ్ళి కలిసే వెళుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను శ్రీలంకలో జరుపుకున్నారు. అక్కడే రహస్యంగా పెళ్ళి చేసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
వీరిద్దరి ప్రేమకు టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ అంగీకరించినప్పటికీ తల్లి ఆయేషా మాత్రం ఒప్పుకోలేదని తెలిసింది. ఈ ప్రేమ వ్యవహారం గురించి దిశాని ప్రశ్నిస్తే.. టైగర్ ఫ్యామిలీతో నేను ఎక్కువగా కలవను`` అని చెప్పింది. ఇప్పుడు మీడియాలో వినిపిస్తున్న పెళ్ళి వార్తపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలుగులో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన లోఫర్` చిత్రంలో హీరోయిన్‌గా నటించిన దిశా పటాని ప్రస్తుతం తమిళంలో సంఘమిత్ర` సినిమా చేస్తోంది. అలాగే టైగర్, దిశా జంటగా నటించిన బాఘి 2` త్వరలో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com