హీరోయిన్ కాకుంటే ఫైలట్ అయ్యేదాన్ని - దిశా పటాని
Send us your feedback to audioarticles@vaarta.com
ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్, తేజ నిర్మించిన భారీ చిత్రం 'లోఫర్`. డిసెంబర్ 17న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దిశాపటానితో ఇంటర్వ్యూ....
కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
నాన్న సివిల్ సర్వీస్ ఉద్యోగి కావడంతో మేం ఉత్తరాఖండ్ నైనిటాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళయినా ట్రాన్స్‌ఫర్స్ అవుతుండటంతో ఒకచోట ఉండలేకపోయాను. నేను లక్నో, నోయిడాలో చదువుకున్నాను. బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు లోఫర్ సినిమాలో అవకాశం వచ్చింది. నా అక్క ఆర్మీలో ఉండటంతో నేను కూడా దేశానికి ఏదైనా చేయాలనుకునేదాన్ని హీరోయిన్ కాకుంటే ఫైలట్ అయ్యుండేదాన్ని. కానీ్ మోడల్‌గా అవకాశం రావడంతో సినిమా రంగం వైపు అడుగులు వేశాను. సినిమాలకు ముందు గార్నియర్, సామ్‌సంగ్ సహా పలుఉ కమర్షియల్ యాడ్స్‌లో నటించాను.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
పూరిగారిని రెండు సంవత్సరాల క్రితం వెరొక సినిమా కోసం కలిశాను. అయితే అప్పుడు ఆయన దర్శకత్వంలో చేసే అవకాశం కుదరలేదు. ఈ సినిమా కోసం ఆయన నన్ను మళ్ళీ ఆడిషన్స్ చేసి సెలక్ట్ చేశారు.
లోఫర్`లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో అమాయకపు అమ్మాయి. కుటుంబానికి విలువనిచ్చే మోడ్రన్ అమ్మాయి పారిజాతం పాత్రలో కనపడతాను. కల్చర్‌ను ఇష్టపడే ఆ అమ్మాయి జీవితంలోకి హీరో ఎంట్రీ ఎలాంటి మార్పు తెచ్చిందనేదే సినిమా.
పూరిగారితో పనిచేయడం ఎలా అనిపించింది?
పూరిగారు స్టయిలిష్ ఫిలిం మేకర్. సినిమాను చాలా ఫాస్ట్‌గా, కమర్షియల్‌గా తీయగలరు. ఎంత కమర్షియల్ సినిమాలో అయినా అందులో ఎమోషనల్ వాల్యూస్‌ను కూడా చక్కగా యాడ్ చేయగలరు. తొలి సినిమాను ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉంది పూరిగారు సినిమాను రెండు నెలల్లోనే పూర్తి చేశారు. సినిమా షూటింగ్ టైంలో రేవతిగారితో పనిచేయడం మరచిపోలేను. ఆమె నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. సినిమాను ఎంజాయ్ చేశాను.
నటన పరంగా ఎదుర్కొన ఇబ్బందులేమైనా పేస్ చేశారా?
అందరి ఉత్తరాది హీరోయిన్స్‌లాగానే నేను కూడా తెలుగు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇబ్బంది ఫీలయ్యాను. అయితే టీం బాగా సపోర్ట్ చేశారు. ప్రతి సీన్ చేయడానికి ముందు బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. కష్టపడకుండా ఏదీ రాదు. తెలియని భాషలో సినిమా చేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది తప్పదు.
ఎలాంటి సినిమలు చేయాలనుకుంటున్నారు?
ఇలాంటి సినిమాలే చేయాలనేం అనుకోవడం లేదు. అన్నీ రకాల సినిమాలు ఉదాహరణకు ఉమెన్ సెంట్రిక్ మూవీస్. అలాగే నాకు బ్రూస్‌లీ, జాకీచాన్ అంటే ఇష్టం కాబట్టి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాను.
వరుణ్‌తేజ్‌తో నటించడం ఎలా అనిపించింది?
వరుణ్ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో అయినా డౌన్ టు ఎర్త్ పర్సన్. బాగా హార్డ్ వర్క్ చేస్తాడు. కూల్‌గా, పోకస్డ్‌గా ఉంటాడు. నేను డైలాగ్స్ చెప్పే టప్పుడు కూడా బాగా సపోర్ట్ చేశాడు. మంచి కోస్టార్.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
లోఫర్ సినిమాయే నా డెబ్యూ మూవీ. ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌తో ఓ బాలీవుడ్ మూవీ చేస్తున్నాను. ఏప్రిల్‌లో విడుదల కానుంది కానీ ఆ వివరాలు ఇప్పుడే చెప్పలేను. అలాగే మరి కొంతమంది తెలుగు దర్శక నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout