దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్ ఇదీ..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’లో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్ టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అంతేకాదండోయ్.. దిశ హత్యా ఘటనను ఖండించని కొందరు సెలబ్రిటీలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాకెక్కి స్పందిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి నెట్టింట్లో ఎక్కడ చూసినా ఈ ఎన్‌కౌంటర్‌పైనే పెద్ద చర్చే జరుగుతోంది.
మంచు మనోజ్: నిందితులను ఎన్కౌంటర్ చేసిన ఆ బుల్లెట్టు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కుందా..? ఈ రోజునే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!
జూనియర్ ఎన్టీఆర్: దిశ హత్యాచార నిందిలను పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయడంతో న్యాయం జరిగిందని.. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరింది.
నాగార్జున: పొద్దు పొద్దున్నే న్యాయం జరిగిందన్న వార్తతోనే లేచాను.
నాని: ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి అంటూ విక్రమార్కుడు సినిమాలోని డైలాగ్‌ను నాని పోస్ట్ చేశాడు.
మంచు లక్ష్మి: నేను మరణశిక్షను సమర్థించను కానీ... కొన్నేళ్లుగా తాను తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని.. రేపిస్టులను ఉరి తీయాల్సిందే. మన జాతికి ఉదహరణగా నిలిచినందుకు, మహిళలపై గౌరవాన్ని చూపినందుకు కేటీఆర్ గారికి థాంక్యూ.
రాజశేఖర్: సజ్జనార్‌గారూ.. మీకు హాట్సాఫ్. బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. మన ముఖ్యమంత్రికి థాంక్స్ అలాగే మన పోలీస్, సజ్జనార్ గారికి హాట్సాఫ్. నీ ఆత్మకు శాంతి చేకూరాలి దిశ
సమంత: ఐ లవ్ తెలంగాణ. భయం అనేది ఒక గొప్ప పరిష్కారం.. కొన్ని సార్లు భయం మాత్రమే పరిష్కారం.
బాలయ్య: పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరింది
పూరీ జగన్నాథ్: పోలీస్ డిపార్ట్మెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు. నేనెప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే.
ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది
— MM*????❤️ (@HeroManoj1) December 6, 2019
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! #JusticeForDisha #Disha #justiceforpriyanakareddy pic.twitter.com/qQ05yD9mo3
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి
— Nani (@NameisNani) December 6, 2019
వాడు పోలీసోడు అయ్యుండాలి#Disha
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019
I ❤️ TELANGANA . Fear is a great solution and sometimes the only solution .
— Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2019
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com