‘సాహో’ సజ్జనార్... జై జై సజ్జనార్..!

  • IndiaGlitz, [Friday,December 06 2019]

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు కర్త, కర్మ, క్రియ ఎవరనేది పక్కనెడితే.. సీపీ సజ్జనార్‌పై సోషల్ మీడియా.. మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది. సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ ఘటనను సమర్థిస్తున్నామని.. మరోవైపు సజ్జనార్‌కు జిందాబాద్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకాశానికెత్తేస్తున్న నెటిజన్లు!
గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడి నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ వరంగల్‌ ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఇప్పుడు దిశ హత్యాచార ఘటన సమయంలోనూ ఆయనే సీపీగా ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఎన్‌కౌంటర్లు సజ్జనార్ నేతృత్వంలోనే జరగడంతో ఆయనపై ఇంటర్నెట్‌లో నెటిజన్లు, సామాన్యులు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు హైదరాబాద్ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. జై పోలీస్.. జైజై పోలీస్.. సాహో సజ్జనార్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న విషయం తెలిసిందే.

నాడూ.. నేడు అసలేం జరిగింది!
కాగా.. నాడు వరంగల్‌లో యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులు కూడా సేమ్ టూ సేమ్ ఘటన జరిగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న వేళ... 2008, డిసెంబర్ 10న వరంగల్ లో స్వప్నికపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న స్పప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతలపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌ తో దాడి చేశాడు. ఆ సమయంలో అతనికి మరో ఇద్దరు సహకరించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేయగా, జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో దిశను హత్య చేసిన చోట సీన్ రీకన్‌ స్ట్రక్షన్ నిమిత్తం నిందితులను విచారిస్తున్న వేళ, వారంతా పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నాడు స్వప్నిక, నేడు దిశ... ఈ రెండు ఘటనల్లోనూ సజ్జనార్ దే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. అయితే అప్పట్లో సజ్జనార్ కీలక పదవిలో ఉన్నారు. నేడు షాద్‌నగర్ ఘటన జరిగినప్పుడూ సీపీగా సజ్జనార్‌ ఉన్నారు. కాగా ఘటనాస్థలికి చేరుకున్న సజ్జనార్ పరిశీలించారు. మరికాసేపట్లో ఈ ఘటనపై మీడియా మీట్ నిర్వహించనున్నారు.

More News

పాయ‌ల్ స్పెష‌ల్ రెట్రో లుక్‌

తొలి చిత్రం ఆర్‌.ఎక్స్ 100తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ ఏ సినిమాను ప‌డితే ఆ సినిమాను చేయ‌కూడ‌ద‌ని సెల‌క్టివ్‌గానే సినిమాలు చేయ‌డానికి రెడీ అయ్యింది.

ఈనెల 27న 'హీరో హీరోయిన్' చిత్రం రిలీజ్

స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరో హీరోయిన్లుగా 'అడ్డా' చిత్రం దర్శకుడు జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో

బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌.. ఆసక్తికర విషయాలు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి దగ్గరే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

నిత్యానంద సరికొత్త లీల.. కొత్తదేశం ఏర్పాటు!

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.

నేనెప్పుడూ ఉల్లి తిన్లేదు.. రేట్లు నాకెలా తెలుస్తాయ్: కేంద్ర మంత్రి

ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో