'లీడర్'కి సీక్వెల్ ?
Send us your feedback to audioarticles@vaarta.com
`బాహుబలి`, `బాహుబలి 2` చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు రానా. ఇక ఈ ఏడాదిలో ఆయన కథానాయకుడిగా వచ్చిన `ఘాజీ`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి.
ఇదిలా ఉంటే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా ఓ సినిమా చేసే అవకాశముందని టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో `లీడర్` చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. రానా నటించిన తొలి చిత్రమైన `లీడర్` 2010 ఫిబ్రవరిలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా.. అందులోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గానే రానా, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమా ఉంటుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా విడుదల కావచ్చని తెలిసింది. ఈ సంవత్సరం జూలై నెలలో వచ్చిన `ఫిదా` చిత్రంతో శేఖర్ కమ్ముల చాన్నాళ్ల తరువాత విజయాన్ని అందుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments