'అంటే సుందరానికి'కి జై కొట్టిన నాని..

  • IndiaGlitz, [Monday,November 16 2020]

నేచురల్‌ స్టార్‌ నాని సినిమాలంటే ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో చెప్పనక్కర్లేదు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో పాటు టైటిల్ కూడా వినూత్నంగా ఉండేలా నాని చూసుకుంటాడు. ఈ వినూత్న టైటిల్‌తోనే జనాల్లోకి బాగా వెళ్లిపోతాడు. ‘అష్టా చెమ్మా’ నుంచి ‘టక్ జగదీష్’ వరకూ నాని సినిమా టైటిల్స్ డిఫరెంట్‌గానే ఉంటాయి. ఒక రకంగా సినిమా జోనర్‌‌ను తన టైటిల్‌లోనే చెప్పేందుకు యత్నిస్తుంటాడు. ‘టక్ జగదీష్’ తరువాత ‘శ్యామ్ సింగరాయ్’గా నాని రాబోతున్నాడు.

కాగా.. ‘శ్యామ్ సింగరాయ్’ తరువాతి సినిమాను కూడా నాని ఇప్పటికే ఫిక్స్ చేసేశాడు. ఆ సినిమాకు టైటిల్ కూడా సిద్ధమైపోయినట్టు సమాచారం. నాని 26వ చిత్రంగా టక్ జగదీష్ తెరకెక్కుతుండగా.. 27వ చిత్రంగా ‘శ్యామ్ సింగరాయ్’.. 28వ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ చిత్రానికి 'అంటే సుందరానికి' అనే ఎంటర్‌టైనింగ్‌ టైటిల్‌‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుంది.

‘అంటే సుందరానికి’ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా షూటింగ్‌ తర్వాతే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నాని సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ఈ సినిమా టైటిల్ చూస్తుంటే పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా కనిపిస్తోంది. ఈ డిఫరెంట్ టైటిలే నాని సినిమాకు సగం పబ్లిసిటీని తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.

More News

నన్ను చూసి అంతా షాకవుతారు: సమంత

అక్కినేని వారి కోడలు సమంత డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. వెబ్ సిరీస్‌లో నటించేందుకు సిద్ధమవుతోంది.

కరోనా వ్యాక్సిన్‌ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

మార్చి ముందు వరకు ప్రపంచంలో మనిషి చాలా స్వేచ్ఛగా తిరిగాడు. కానీ.. మార్చి నుండి పరిస్థితి మారిపోయింది.

నేడు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం.. మంత్రి పదవులపై ఆసక్తి..

బిహార్ నూతన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరోసారి బాలయ్య అతిథి పాత్ర చేస్తారా?

నటసింహ నందమూరి బాలకృష్ణ గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తారా? అంటే ఎందుకు నటించరని ఆయన అభిమానులు ఎదురు ప్రశ్నిస్తారు.

గుడిలో దేవుడి ముందు మోకరిల్లి అలాగే ప్రాణాలొదిలిన మాజీ ఎమ్మెల్యే..

ఆయనో మాజీ ఎమ్మెల్యే.. ధన్‌తేరాస్ సందర్భంగా ఆలయానికి వెళ్లి పూజ చేస్తూ దేవుడికి శిరస్సు వంచి ప్రణామం చేసి అలాగే కిందపడిపోయారు.