బాబోయ్ సీత.. కట్టప్ప రేంజ్ ఇమేజా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రాముడిగా ప్రభాస్ ఫిక్స్.. రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ ఫిక్స్.. ఇప్పుడు సీత ఎవరు? అనేదే చాలా పెద్ద ప్రశ్న. దీనికి ఏ రేంజ్ క్రేజ్ ఏర్పడిందంటే.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఏ రేంజ్‌లో ప్రేక్షకుల మనసులను కలవరపరిచిందో అంతగా ‘ఆదిపురుష్’లో సీత ఎవరనే ప్రశ్న కూడా ప్రేక్షకుల మదిని తొలిచేస్తోంది.
ఇప్పటికే సీత ఫలానా అంటూ పలువురు ముద్దుగుమ్మ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మొదట ఈ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోందంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత అనుష్క శర్మ, కియారా అద్వాని, దీపిక పదుకొణె పేర్లు సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది. ఈ ముద్దుగుమ్మల్లో సీత లేదని వెల్లడించింది. మళ్లీ ప్రశ్న మొదటికి వచ్చింది. తాజాగా సీత పాత్రకు సంబంధించి మరో ముద్దుగుమ్మ పేరు బయటకు వచ్చింది.
బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ సీత పాత్రలో నటించనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పట్లో చిత్రబృందం సీత పాత్రపై స్పందించదనిపిస్తోంది. కారణం కట్టప్ప రేంజ్ ప్రచారం. ఏమాత్రం ఊహించని ప్రచారమిది. పైసా ఖర్చు లేకుండా సినిమాకు ఈ రేంజ్ ప్రచారం వస్తుంటే ఎవరు కాదనుకుంటారు? అందుకే చిత్రబృందం సీత పాత్రపై కొంతకాలం పాటు సస్పెన్స్ మెయిన్‌టైన్ చేసే అవకాశం ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రభాస్ విలువిద్యలో శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com