'డిస్కోరాజా' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమా, టీజర్ తాజాగా రిలీజ్ అయింది, సైన్స్ ఫిక్షన్ జానర్ లో డిస్కోరాజా రెడీ అవుతుంది అని ఈ చిత్ర బృందం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన టీజర్ ని కూడా సిద్ధం చేసినట్లుగా దర్సకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఎంతో శ్రమతో, హాలీవుడ్ నిపుణల పర్యవేక్షణలో ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ తో టీజర్ రూపొందించామని. అలానే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ కూడా టీజర్ లో వాడినట్లు గా ఆనంద్ చెప్పారు.
ఇక మాస్ మహారాజ రవితేజ ఫాన్స్ కోరుకునే విధం గా ఈ సినిమాలో ఉన్న అయన రిట్రో గెట్ అప్ ఫై ఉన్న యాక్షన్ షాట్స్ తో ఈ టీజర్ ఎండింగ్ చేయడం జరిగింది అని చెప్పారు వి ఐ ఆనంద్. టీజర్ స్టార్టింగ్ లో రవితేజ గారు చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని, రవితేజ ఫాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే విధంగా డిస్కోరాజా ని సిద్ధం చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. జనవరి 24 న భారీ స్థాయిలో డిస్కోరాజా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ తళ్లూరి చెప్పారు.
నటీనటులు : రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com