'డిస్కోరాజా' టీజర్ విడుదల

  • IndiaGlitz, [Friday,December 06 2019]

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఈ సినిమా, టీజర్ తాజాగా రిలీజ్ అయింది, సైన్స్ ఫిక్షన్ జానర్ లో డిస్కోరాజా రెడీ అవుతుంది అని ఈ చిత్ర బృందం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన టీజర్ ని కూడా సిద్ధం చేసినట్లుగా దర్సకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఎంతో శ్రమతో, హాలీవుడ్ నిపుణల పర్యవేక్షణలో ఐస్లాండ్ తదితర ప్రాంతాల్లో తీసిన విజువల్స్ తో టీజర్ రూపొందించామని. అలానే అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ల్యాబ్ సెట్ లో తీసిన షాట్స్ కూడా టీజర్ లో వాడినట్లు గా ఆనంద్ చెప్పారు.

ఇక మాస్ మహారాజ రవితేజ ఫాన్స్ కోరుకునే విధం గా ఈ సినిమాలో ఉన్న అయన రిట్రో గెట్ అప్ ఫై ఉన్న యాక్షన్ షాట్స్ తో ఈ టీజర్ ఎండింగ్ చేయడం జరిగింది అని చెప్పారు వి ఐ ఆనంద్. టీజర్ స్టార్టింగ్ లో రవితేజ గారు చెప్పిన డైలాగ్ వైరల్ అవ్వడం ఖాయం అని, రవితేజ ఫాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే విధంగా డిస్కోరాజా ని సిద్ధం చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు. జనవరి 24 న భారీ స్థాయిలో డిస్కోరాజా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ తళ్లూరి చెప్పారు.

న‌టీన‌టులు : ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

More News

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం  అని నేను భావించాను.

సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

`సింహ, లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో

శ్రీవిష్ణు హీరోగా 'ఎల్.ఎల్.పి' చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.

ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం లభించింది: పవన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ బాధితురాలి తల్లిదండ్రులు..