'డిస్కోరాజా'వాయిదా పడుతుందా?
- IndiaGlitz, [Thursday,October 17 2019]
మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఒక పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే క్రిస్మస్ సందర్భంగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం 'రూలర్'(వినపడుతున్న టైటిల్), సాయితేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమాలు లైన్‌లోకి వచ్చాయి. ఈ మూడు సినిమాలతో పాటు నితిన్ 'భీష్మ' సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. ఇంత కాంపీటీషన్ నడుమ 'డిస్కోరాజా'ను విడుదల చేయాలా? వద్దా? అని నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న విడుదల చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నారట.
ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం(తండ్రీ కొడుకులు) చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. ఈ రివేంజ్ డ్రామాకు సంబంధించిన లుక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొందుతుంది.