ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా?

  • IndiaGlitz, [Tuesday,February 04 2020]

బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన యాక్ష‌న్ సిరీస్ ధూమ్‌.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు భాగాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి విజ‌య‌వంత‌మైయ్యాయి. ఇప్పుడు నాలుగో భాగం 'ధూమ్ 4'కి రంగం సిద్ధ‌మ‌వుతుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ధూమ్ 4లో బాలీవుడ్ కిలాడీగా పేరు తెచ్చుకున్న అక్ష‌య్‌కుమార్ నటించ‌నున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది. ధూమ్ సిరీస్‌లో ముందు నుండి న‌టిస్తున్న అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఉద‌య్ చోప్రా ఈ చిత్రంలో న‌టించ‌క‌పోవ‌చ్చున‌ని అంటున్నారు.

నిజానికి సాహో స‌మ‌యంలో ఈ ఫ్రాంచైజీలో ప్రభాస్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వచ్చాయి. అయితే ప్ర‌స్తుతం వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్పేలా లేదు. ధూమ్ నుండి ధూమ్ 3 వ‌ర‌కు అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఉద‌య్ చోప్రా న‌టించారు. కాగా.. ధూమ్‌లో జాన్ అబ్ర‌హం, ధూమ్ 2లో హృతిక్ రోష‌న్‌.. ధూమ్ 3లో ఆమిర్‌ఖాన్ మెయిన్ పాత్ర‌ధారులుగా న‌టించి మెప్పించారు. మ‌రి ధూమ్ 4లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై చాలా రోజులుగా ప‌లు వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. షారూక్‌, ప్ర‌భాస్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డ‌ప్ప‌టికీ ఇప్పుడు రేసులో అక్ష‌య్ ఛాన్స్ కొట్టేశాడ‌ని అంటున్నారు.

More News

నానితో హైబ్రీడ్ పిల్ల‌..?

నాని ప్ర‌స్తుతం ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' గా రాబోతున్న అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రోడ‌క్ష‌న్ నెం 5 కి టైటిల్ కంఫర్మ్ అయ్యింది.

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

3 రాజధానులపై తేల్చేసిన కేంద్రం!

నవ్యాంధ్ర రాజధాని అమరావతినితో పాటు మరో క్యాపిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్-19న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

విజయనగరంలో వింత ఫ్యామిలీ.. జగన్ ఛాన్సిస్తే..!?

మనం ఇంట్లో కటుంబ సభ్యులతో.. బయట ఫ్రెండ్స్‌తో గొడవపడుతుంటాం.. మళ్లీ కొన్ని నిమిషాలకో లేదా గంటకో యథావిధిగా మాట్లాడేస్తుంటాం..