సంపత్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ`టీజర్ లాంచ్.. మరో జాతిరత్నాలంటూ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా పుల్‌మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తోన్న చిత్రం ‘‘సౌండ్ పార్టీ’’. సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్‌లో సౌండ్ పార్టీ ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా టీజర్ లాంచ్ చేసింది. ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా సౌండ్ పార్టీ టీజర్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. సౌండ్ పార్టీ టీజర్ బాగుందని, మోహిత్ సంగీత్ బాగుందని ప్రశంసించారు. ఈ చిత్రం మరో జాతిరత్నాలులా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్ధమవుతుందని సంపత్ నంది అన్నారు. హీరో వీజే సన్నీకి ఇది మంచి సినిమా అవుతుందని ఆయన పేర్కొన్నారు.
తాను గతంలో కొన్ని చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించానని.. ఇప్పుడు అదే బాటలో జయశంకర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారని సంపత్ నంది తెలిపారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ చేతిలో సెల్‌ఫోన్, సిగరెట్ పట్టుకుని తిరుగుతుంటారని.. కానీ జయశంకర్ మాత్రం పుస్తకం పట్టుకుని తిరుగుతూ వుంటాడని సంపత్ నంది ప్రశంసించారు. అతనిలోని ఈ క్వాలిటీ నచ్చి పేపర్ బాయ్ సినిమాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చానని ఆయన గుర్తుచేశారు.
నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ.. ఫుల్‌మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్ అందించేలా సౌండ్ పార్టీని తెరకెక్కించామని చెప్పారు. టీజర్ లాంచ్ చేసిన సంపత్ నందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్‌లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని.. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించామని రవి చెప్పారు.
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ.. మా టీజర్ లాంచ్ చేసిన సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు. మనం బాహుబలి లాంటి కథ రాసుకున్నా మన వెనుక ఒక బలం వున్నారు.. అలాంటి వారే జయశంకర్ అని ప్రశంసించారు. ఈ సినిమాలో సన్నీ, శివన్నారాయణ పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తాయని తెలిపారు. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేశామని చెప్పారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ.. జయశంకర్ సపోర్ట్‌తో సంజయ్ చాలా బాగా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ చిత్రంలో తాను , శివన్నారాయణ తండ్రీ కొడుకులుగా నటించామని.. ఇద్దరం నవ్విస్తామని ఆయన తెలిపారు. మోహిత్ మ్యూజిక్ బాగుందని.. అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమాను ఆదరించాలని వీజే సన్నీ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments