హీరో సూర్యకు షాకిచ్చిన డైరెక్టర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
అటు తమిళ ఇటు తెలుగులో తన సినిమాలకు ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న అతి కొద్ది మంది హీరోల్లో సూర్య ఒకరు. ఈయన సినిమాలు తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈయన ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా వాడివాసల్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందుగానే డైరెక్టర్ హరి దర్శకత్వంలో సూర్య అరువా అనే ఓ సినిమా చేయాల్సింది. కానీ ఆ స్థానంలో వెట్రిమారన్ వచ్చి చేరాడు.
సూర్య, హరి కాంబినేషన్ అంటే.. సింగమ్ సీక్వెల్‌తో పాటు మరికొన్ని సినిమాలు రూపొందాయి. ఇప్పుడు అరువా సినిమా రూపొందుతుందని, అభిమానులు భావించారు. కానీ ఈ కాంబినేషన్ కుదరడం లేదు. సూర్య ముందు వెట్రిమారన్ సినిమాను చేయడానికి ఆసక్తి చూపించి హరిని హోల్డ్ లో పెట్టేశాడు. అయితే హరి వెయిటింగ్‌లో ఉండటానికి ఇష్టపడలేదేమో కానీ.. సూర్య స్థానంలో అరుణ్ విజయ్‌తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇది ఓ రకంగా సూర్యకు షాకింగే... అయినా హరి వెయిట్ చేసే మూడ్‌లో లేడని టాక్.
ప్రస్తుతం సూర్య హీరోగా నటించిన శూరరై పోట్రు చిత్రం తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలవుతుంది. సుధాకొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ బయోపిక్ ఇది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com