మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అదేంటి సినిమా చాన్స్ ఇచ్చిన హీరోపై మరి సుకుమార్ ఎందుకు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాడనే విషయంలోకి వెళితే..మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్-నేనొక్కడినే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
14రీల్స్, మహేష్ సుకుమార్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారని అయితే తాను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానని, ఆ బాధ ఇప్పటికీ మనసులో ఉందని అనుకుటున్నాడట దర్శకుడు సుకుమార్. అందుకే మరో అవకాశం వస్తే మహేష్ తో కచ్చితంగా సూపర్ హిట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ విషయాన్ని సుక్కు ఓ ఇంర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి సుక్కు కోరికను మహేష్ మన్నిస్తాడా..చూద్దాం...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com