గుడులు..గోపురాలు చుట్టూ తిరుగుతున్న డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
గుడులు..గోపురాలు చుట్టూ తిరుగుతున్న డైరెక్టర్..ఎవరో కాదు బ్రహ్మోత్సవం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అసలు..శ్రీకాంత్ అడ్డాల ఏ కథ చెప్పారో..? మహేష్ ఎలా ఓకే అన్నాడో అర్ధం కావడం లేదు అంటూ సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే..మహేష్ మురుగుదాస్ తో నెక్ట్స్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు.
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి మరోలా ఉంది. శ్రీకాంత్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన వాళ్లందరూ బ్రహ్మోత్సవం రిలీజ్ తర్వాత వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో శ్రీకాంత్ అడ్డాల ఏం చేయాలో తెలియక గుడులు..గోపురాలు చుట్టూ తిరుగుతున్నాడట ఈ విషయాన్ని ఓ బడా నిర్మాత స్వయంగా మీడియా ప్రతినిధులుతో చెప్పడం విశేషం. శ్రీకాంత్ అడ్డాల...మనిషి అంటేనే మంచోడు అంటాడు. సక్సెస్ ఉంటేనే విలువ ఇస్తున్న ఇండస్ట్రీలో మనుషులును చూసిన తర్వాత నిర్ణయం మార్చుకుంటాడేమో...ఏది ఏమైనా నిజంగానే మంచోడైన శ్రీకాంత్ అడ్డాలకి మంచి జరగాలి..మరో మంచి సినిమా అవకాశం రావాలని కోరుకుందాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments