పవన్ ,మహేష్ లతో సినిమా చేస్తున్న డైరెక్టర్..

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సూప‌ర్ స్టార్ మ‌హేష్...వీరిద్ద‌రితో ఒకేసారి సినిమాలు చేసే అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్నాడు ఓ డైరెక్ట‌ర్. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..ఎస్.జె.సూర్య‌. కోలీవుడ్ లో స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎస్.జె.సూర్య టాలీవుడ్ లో ప‌వ‌న్, మ‌హేష్ ల‌తో సినిమాలు చేస్తూ మ‌ళ్లీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఖుషీ, పులి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఎస్.జె.సూర్య తాజాగా ప‌వ‌న్ తో ఓ ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ తో మూవీ తెరకెక్కిస్తుంటే...మ‌హేష్ తో క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. మురుగుదాస్ డైరెక్ష‌న్ లో మ‌హేష్ న‌టిస్తున్న చిత్రంలో ఎస్.జె.సూర్య విల‌న్ గా న‌టిస్తున్నాడు. ఇలా...ప‌వ‌న్, మ‌హేష్..ఇద్ద‌రితో సినిమాలు చేసే అవ‌కాశం రావ‌డం...అది కూడా ఒకే టైమ్ లో రావ‌డం విశేషం. మ‌రి...ద‌ర్శ‌కుడుగా ప‌వ‌న్ సినిమాతో, న‌టుడుగా మ‌హేష్ సినిమాతో ఎస్.జె.సూర్య విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.