నాగబాబు.. నువ్వెంత.. నీ బతుకెంత : డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్యపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు పెద్దలు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా.. ఇంటర్వ్యూల వేదికగా, మీడియాతో మాట్లాడారు. అయితే రోజుకు రోజుకూ ఈ వ్యవహారం ముదురుతోందే తప్ప ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మాత్రం కనిపించట్లేదు. తాజాగా ఓ కుర్ర డైరెక్టర్ స్పందిస్తూ.. నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. లెజెండరీ రచయిత త్రిపురనేని మహారథి మనవడు, త్రిపురనేని చిట్టి తనయుడు, దర్శకుడు విజయ్ చౌదరి తాజాగా స్పందించాడు.
నువ్వెంత.. నీ బతుకెంత..!?
‘నాగబాబూ.. నువ్వెంత నీ బతుకెంత.. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది. కోన్‌కిస్కా గొట్టంగాడివి. ఇండస్ట్రీలో సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడివి నువ్వు. ఇండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరిని లైన్లో నిలబెడితే వెనక నుంచి ముందు వచ్చేది నువ్వే. రోజా తర్వాత అంత పెద్ద యాంకర్ నువ్వు. నువ్వా మా బాలయ్య గురించి మాట్లాడేది. నువ్వు కానీ చిరంజీవి తమ్ముడివి కాకపోతే నీ బతుకేంటి..? పవన్ కళ్యాణ్ అన్నవి కాకపోతే నిన్నెవడు పట్టించుకుంటాడు..? నువ్వో కోన్‌కిస్కా గొట్టంగాడివి..? బోస్డికే?. బాలయ్యను పిలవకుండా మీటింగ్స్ జరిపేంత దమ్ము నీకుందా..? మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. కింగ్ కాదు.. ఇండస్ట్రీ ఏం మీ ఫ్యామిలీ సొత్తు కాదు..? బాలయ్యను మీటింగులకు పిలవాల్సిన భాద్యత మీది కాదా?. మీలా లోపల ఒకటి.. బయట ఒకటి పెట్టుకుని మాట్లాడే మనస్తత్వం కాదు బాలయ్యది. లోపల ఏముంటే అది బయటికి అడిగేస్తాడు’ అని తీవ్ర పదజాలం వాడుతూ విజయ్ రెచ్చిపోయాడు.
నువ్వు.. నీ అన్న, తమ్ముడు ఏమైనా కింగా?
‘నువ్వేమన్నా కింగా..? మీ అన్నేమైనా కింగా..? లేదంటే మీ తమ్ముడేమైనా కింగా..? బొంగేం కాదు. మీ కాపు వర్గంలో మరో స్టార్ హీరో ఎందుకు రాలేదు..? మీరు రానివ్వలేదు..? తొక్కేసారు.. మీరొక్కరే ఉండాలని తొక్కేసారు. మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం నాయకులతో పాటు ఎంతమంది నాశనం అయిపోయారు. అలాంటి మీరా బాలయ్య గురించి మాట్లాడేది. అసలు ఇండస్ట్రీలో ఉన్న కమిటీలు ఏంటి..? దాంట్లో ఉన్న మెంబెర్స్ ఎవరు..? గట్టిగా నాలుగు సినిమాలు కూడా తీయని వాడు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్..? రెండు సినిమాలు నిర్మించని వాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్..? వాళ్లదో కమిటీనా..?. నీ యిష్టమొచ్చినట్లు ఇక్కడ కూడా నోరు పారేసుకుంటామంటే ఎవ్వడూ చూస్తూ ఊరుకోడు.. కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు’ అని విజయ్ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే దీనిపై నాగబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా.. ఇప్పటికే విజయ్‌పై మెగా ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్‌గా పరిస్థితులు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments