దర్శకుడు వెంకట్ మహ కొత్త చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య'
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం `బాహుబలి`. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాతలు వెంటనే మరో సినిమానో నిర్మించకుండా క్వాంటిటీ కంటే క్వాలిటీ సినిమాల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ఆర్కా మీడియా వర్క్స్, మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా `కేరాఫ్ కంచపాలెం` ఫేమ్ వెంకటేశ్ మహ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు.
మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన హిట్ చిత్రం `మహేశింతే ప్రతీకారమ్` చిత్రాన్ని వెంకటేశ్ మహ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో `ఉమామహేశ్వర ఉగ్రరూపాశ్య` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా వీడియో అనౌన్స్‌మెంట్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. జి.ఒ.డి వెబ్ సిరీస్ సక్సెస్, బ్రోచెవారెవరురా సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు సత్యదేవ్ కంచరన ఇందులో హీరోగా నటిస్తున్నారు.
వేదం వంటి కంటెంట్ బేస్డ్ చిత్రాన్ని నిర్మించిన ఈ అగ్ర నిర్మాతలు ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - ``వెంకటేశ్ మహ మన తెలుగు నెటివిటీకి తగ్గట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెరకెక్కించగల దర్శకుడు. మలయాళంలో విజయవంతమైన `మహేశింతే ప్రతీకారమ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా తను తెరకెక్కించగలడని నమ్మకంతో సినిమాను స్టార్ట్ చేశాం`` అన్నారు. వెంకటేశ్ మహ అరకు వ్యాలీలో 36 రోజుల్లోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుజరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 17, 2020 విడుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీతలు బిజ్‌బల్ సంగీతాన్ని, అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు: సత్యదేవ్ కంచరన, నరేష్, సుహాస్, జబర్‌దస్త్ రాంప్రసాద్, కరుణాకరణ్, టి.ఎన్.ఆర్, రవీంద్ర విజయ్, కె.రాఘవన్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout