గురువు గారి మాట పాటించాను...చుట్టాలబ్బాయితో సక్సెస్ సాధించాను - డైరెక్టర్ వీరభద్రమ్
- IndiaGlitz, [Sunday,August 21 2016]
అహనా పెళ్లంట, పూలరంగడు, భాయ్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం చుట్టాలబ్బాయి. ఆది, నమితా ప్రమోద్ జంటగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శితమౌతుంది. రామ్ తల్లూరి, వెంకట్ తలారి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చుట్టాలబ్బాయి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా చుట్టాలబ్బాయి డైరెక్టర్ వీరభద్రమ్ తో ఇంటర్ వ్యూ మీకోసం...
చుట్టాలబ్బాయి చిత్రానికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుంది..?
మేము ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. మల్టీప్లెక్స్ లో కూడా హాస్ ఫుల్స్ అవుతున్నాయి. మూడు రోజుల్లో మూడు కోట్లు వసూలు చేసింది. ఆది కెరీర్లోనే మంచి ఓపెనింగ్స్ ఈ చిత్రానికి రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. ఇంకా ఏరేంజ్ కి వెళుతుంది అనేది చూడాలి.
ఆది - సాయికుమార్ ఫస్ట్ టైమ్ కలిసి నటించారు కదా..! తండ్రికొడుకులిద్దరినీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు.?
సాయికుమార్ గారు నా మనసుకి బాగా నచ్చిన వ్యక్తి. వావ్ అనే ప్రొగ్రామ్ చేసినప్పుడు సాయికుమార్ గారితో పరిచయం ఏర్పడింది. ఈ సినిమాలో దొరబాబు అనే క్యారెక్టర్ ఉంది. అది సాయికుమార్ గారు చేస్తే బాగుంటుంది అనిపించింది. మా అంచనాకి తగ్గట్టు దొరబాబు క్యారెక్టర్ తెర పై కనిపించగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. ఆది, సాయికుమార్ గారు ఇప్పటి వరకు కలిసి నటించకపోవడం...ఆ అవకాశం నాకు రావడం చాలా ఆనందం కలిగించింది.
చుట్టాలబ్బాయి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..?
ఈరోజు వెంకయ్యనాయుడు గార్కి చుట్టాలబ్బాయి చిత్రాన్ని చూపిస్తున్నాం. అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ కోరిక మేరకు స్పెషల్ షో వేస్తున్నాం. సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాం. పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాం.
చుట్టాలబ్బాయి చిత్రానికి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమిటి..?
నేను తేజ గారి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసాను. వైజాగ్ లో తేజ గారి ధియేటర్ లోనే అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలు రిలీజ్ చేసాం. ఆ రెండు చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇప్పుడు చుట్టాలబ్బాయి చిత్రాన్ని కూడా తేజ గారి థియేటర్ లోనే రిలీజ్ చేసాం. రిలీజ్ రోజు తేజ గారు ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్పి ఒక గంట సేపు మాట్లాడారు. నీకు ఇక తిరుగులేదు అన్నారు. ఆయన అభినందన ఎప్పటికీ మరచిపోలేను.
ఈ సినిమాలో ఓ పాటలో మీరు డ్యాన్స్ చేసారు కదా..ధియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ ఆలోచన ఎవరిది..?
బ్యాంకాక్ లో ఆ సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు ఆది మీరు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు కదా...మీరు ఈ సాంగ్ లో కనిపిస్తే బాగుంటుంది అన్నాడు. మీరన్నట్టు ఆ సాంగ్ లో నేను కనిపించగానే థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుండడం చాలా హ్యాపీ అనిపించింది.
భాయ్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా...ఆ టైమ్ లో ఒత్తిడికి లోనయ్యారా..?
భాయ్ తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు మా గురువు ఇ.వి.వి గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాను. ఆయన ఏమన్నారంటే...గ్యాప్ రావడం అదృష్టం. గ్యాప్ వస్తే ఫీలవ్వద్దు ఆ టైమ్ లో పాజిటివ్ గా ఆలోచించు కథలు రెడీ చేసుకో అని చెప్పారు. గురువు గారు చెప్పినట్టే గ్యాప్ లో నాలుగు కథలు రెడీ చేసాను. ఆ నాలుగు కథల్లో ఒకటి చుట్టాలబ్బాయి.
భాయ్ తర్వాత గ్యాప్ నుంచి బయటపడి చుట్టాలబ్బాయి తీసారు సక్సెస్ సాధించారు కదా..ఇప్పుడు ఏమనిపిస్తుంది..?
గ్యాప్ రావడం...ఆతర్వాత ఆ గ్యాప్ నుంచి బయటపడి సక్సెస్ సాధించడం అంటే చాలా కష్టం. అలాంటిది చుట్టాలబ్బాయితో సక్సెస్ సాధించడం...ముఖ్యంగా నేను సక్సెస్ సాధించడంతో పాటు ఆదికి కూడా సక్సెస్ ని అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
మూడు కథలు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అలాగే పూలరంగడు కన్నడ రీమేక్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను.