‘పొలమారిన జ్ఞాపకాలు’తో వస్తున్న డైరెక్టర్ వంశీ..
- IndiaGlitz, [Sunday,March 31 2019]
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రియులకు.. మరీ ముఖ్యంగా ‘మంచుపల్లకీ’, ‘సితార’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడీస్ టైలర్’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘గోపి గోపిక గోదావరి’.. ఈ చిత్రాల్లో ఏ ఒక్క సినిమా చూసున్నా వంశీ అంటే తెలుస్తుంది. ఆయన సినిమా తెరకెక్కించారంటే అదుర్స్ అంతే.. బొమ్మ బ్లాక్ బ్లాస్కర్ అయ్యి తీరాల్సిందే. ముఖ్యంగా సినీ ప్రియులకు ‘గోపి గోపిక గోదావరి’.. ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ మూవీ అయితే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.
కేవలం 22 సంవత్సరాల వయసుకే వంశీ.. తన తొలి సినిమాకు దర్శకత్వం వహించారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా ఒకటి రెండు కాదు ఎన్నో.. ఎన్నోన్నో సినిమాలను తెలుగు సినీ ప్రియులకు అందజేసి అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఈయన ఏ సినిమా చేసినా దాదాపు అన్నీ గోదావరి నేపథ్యంలో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేశాయి.
ఇక అసలు విషయానికొస్తే.. వంశీలో ఒక్క దర్శకుడే కాదు గొప్ప రచయిత కూడా దాగున్నాడు. ఇప్పటికే పలు కథలు, నవలలు, వ్యాసాలు రాసి ఎంతో మంది మెప్పు పొందారు. తాజాగా తన ఆటో బయోగ్రఫి ‘పొలమారిన జ్ఞాపకాలు’ పేరుతో తన జీవిత చరిత్ర రాస్తున్నారు.
ఈ బయోగ్రఫి త్వరలోనే స్వాతి పత్రిక సీరియల్లా రానుంది. ఈ విషయాన్ని పలువురు పీఆర్వోలు తమ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే ఈ ప్రకటన వెలువడిన నాటి నుంచి సీరియల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు, స్వాతి పాఠకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.